Click Here!

హైదరాబాద్, జనవరి 23 : రచ్చ... రచ్చవుతోంది. మొదలుకాకమునుపే 'బండ'లు పడుతున్నాయి. సోమవారం నుంచి వచ్చేనెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 'రచ్చబండ' తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలోని డోలపేటలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 'ఇది 2009 తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం.

హైదరాబాద్, జనవరి 23 : చర్చలు కొలిక్కి వచ్చాయి. ప్రతిష్టంభన తొలగింది. సయోధ్య కుదిరింది. సమ్మె సైరన్ ఆగింది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ వర్గాలకు, ప్రభుత్వానికి మధ్య గత రెండు రోజులుగా దఫదఫాలుగా జరిగిన చర్చలు ఆదివారం ఓ కొలిక్కి వచ్చాయి. కొద్ది నెలలుగా 11 డిమాండ్ల పరిష్కారానికి ఆందోళనలు చేస్తూ వచ్చిన ఉద్యోగులు కొంతమేరకు పట్టు సడలించారు. అదే సమయంలో, ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగివచ్చింది. కొన్ని ప్రధాన డిమాండ్లను ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్, జనవరి 23 : "తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టిని మరల్చడానికే రచ్చబండ అనే రొచ్చు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిని బహిష్కరించండి. ఈ కార్యక్రమానికి వచ్చే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తరిమికొట్టండి'' అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రచ్చబండ కార్యక్రమాన్ని జరగకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెంప చెళ్లుమనిపించాలని, ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆదివారం 'తెలంగాణ వర్తమాన ఉద్యమం-మన కర్తవ్యం' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.